Deputy CM Bhatti : హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ సందర్బంగా స్పందించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti). సోమవారం ఆయన మధిర క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను బీఆర్ఎస్ నాశనం చేసిందంటూ ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అన్నింటిని పరిగణలోకి తీసుకుని ప్రజా పాలన సాగిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు తాము అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. అవే తమను గెలిపించేలా చేస్తాయన్నారు.
Deputy CM Bhatti Challenges
బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకుని రాష్ట్ర ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఆదరణ పొందాయన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం దశాబ్దాలుగా వెనుకబడిన తరగతుల ఆకాంక్షలను నెరవేర్చాయని ఆయన అన్నారు. ప్రణాళికా విభాగం కింద సామాజిక-ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఆయన అన్నారు. అయితే ప్రజల కోసం నిలబడే కాంగ్రెస్ పార్టీని కుట్రల ద్వారా కోర్టులకు లాగడానికి బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు.
Also Read : Tilak Varma Interesting Play : తిలక్ వర్మ విరాట్ కోహ్లీ లాగా ఆడాడు

















