Deputy CM Bhatti : నల్లగొండ జిల్లా – బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందని ఆవేదన చెందారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti). నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ జెన్కో పవర్ హౌస్‌ను సందర్శించి, జల విద్యుత్ ఉత్పత్తిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
Deputy CM Bhatti Vikramarka Slams BRS
బిఆర్ఎస్ నేతలు సీఎం స్థాయి వ్యక్తులను హౌలే, సన్నాసి అని సంబోధించడం దారుణమన్నారు. సమాజానికి తలవంపులు కలిగించే భాష వాడడం మంచిది కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బిఆర్ఎస్ నేతలు ఇప్పటికీ తమ తీరును మార్చు కోలేదన్నారు.
నీళ్ల కోసమే అధికారాన్ని తెచ్చుకున్నాం, పదేళ్లు పరిపాలించిన బిఆర్ఎస్ నేతలు మొద్దు నిద్ర మూలంగా…కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాలను తేల్చ లేక పోయిందన్నారు భట్టి విక్రమార్క. ప్రాజెక్టులను పూర్తి చేయక పోవడం వల్ల నీటి సమస్యలు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా సోనియా గాంధీ ఇతర పార్టీలను ఒప్పించి, పార్లమెంటులో తగిన బలం లేకపోయినా ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని అన్నారు
నాగార్జునసాగర్‌ను హరిత విప్లవంలో భాగంగా కాంగ్రెస్ నిర్మించిందన్నారు. 1978లోనే రివర్స్ పంపింగ్ స్టోరేజ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ప్రాజెక్టు 21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందిస్తూ, 816 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో నిర్వహించిన సిబ్బందిని అభినందిస్తున్నట్లు చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు వల్ల విద్యుత్ డిమాండ్ 9.96 శాతం రేటుతో పెరుగుతోందన్నారు. ఏడాదిలోనే 2,000 మెగావాట్ల అధిక విద్యుత్ డిమాండ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా అందించామన్నారు.
Also Read : CM Revanth Reddy Alarming : 2034 వరకు నేనే సీఎం నేనే సుప్రీం – రేవంత్ రెడ్డి
















