పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ విష‌యంలో ఆల‌స్యం వ‌ల్లే ఇబ్బంది

వెంక‌టేష్ ఆద‌ర్శ కుటుంబం రిలీజ్ వాయిదాపై

hellotelugu-NagavamshiProducer

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము నిర్మించిన విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన‌, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఆద‌ర్శ కుటుంబం అక్టోబ‌ర్ 6న ట్రైల‌ర్ లాంచ్ కావాల్సి ఉంది. అంతే కాకుండా ఇప్ప‌టికే ప‌లుమార్లు ఈ సినిమా విడుద‌ల తేదీపై అనుమానాలు వ్య‌క్తం అవుతూ వ‌చ్చాయి. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు గానే నిర్మాత నాగవంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. ఆద‌ర్శ కుటుంబం సినిమాను అనుకున్న తేదీకి అంటే అక్టోబ‌ర్ 9వ తేదీన విడుద‌ల చేయ‌డం లేదంటూ బాంబు పేల్చారు. ఈ మేర‌కు త‌మ‌ను మ‌న్నించాల‌ని కోరారు . కేవలం మూడు, నాలుగు రోజుల క్రితం వరకు కూడా, ఈ సినిమా విడుదలవుతుందని మేము చాలా నమ్మకంతో ఉన్నాము. అందుకే విదేశాల్లో బుకింగ్స్‌ను కూడా ప్రారంభించాం. కానీ నిన్న ఉదయం నాటికి కూడా, విదేశీ సెన్సార్‌కి కంటెంట్‌ను సమర్పించలేని పరిస్థితిలో ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు నాగవంశీ.

పోస్ట్-ప్రొడక్షన్ పనుల విషయంలో తాము మూడు, నాలుగు రోజులు వెనుకబడి పోయామ‌న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను హడావిడిగా విడుదల చేయడం కంటే అన్ని విషయాలను క్షుణ్ణంగా సరిచూసుకుని, నాణ్యమైన అవుట్‌పుట్‌తో మీ ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశంతోనే ఈ వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌న్నారు. ప్రచార కార్యక్రమాలకు (ప్రమోషన్స్) కూడా మాకు సమయం తగ్గిపోయింద‌ని తెలిపారు. రాబోయే రెండు, మూడు వారాల్లో సరైన తేదీని చూసుకుని, వెంకటేష్ తో చర్చించి, కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. మిగిలిన పాటలు , ట్రైలర్‌ను విడుదల చేసి, రాబోయే రెండు, మూడు వారాల పాటు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించి , వీలైనంత త్వరగా మీ ముందుకు వస్తామని చెప్పారు.

Exit mobile version