వారెవ్వా కార్తీక్ శ‌ర్మ కెవ్వు కేక

చెన్నై జ‌ట్టు గెలుపులో కీ రోల్

hellotelugu-KartikSharma

ఢిల్లీ : ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను స్వంత గ‌డ్డపై ఓడించింది 8 వికెట్ల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ . డీసీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవ‌డం విస్మయానికి గురి చేసింది. పిచ్ అంత‌కంత‌కూ మారుతోంది. ఈ త‌రుణంలో బౌలింగ్ కు ఎక్కువ‌గా అనుకూలిస్తుంద‌ని , ప‌రుగులు ఎక్కువ చేసి ఒత్తిడి పెంచ‌వ‌చ్చు అని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఒకానొక ద‌శ‌లో 67 ప‌రుగులకే కీల‌క‌మైన వికెట్ల‌ను కోల్పోయింది. చెన్నై బౌల‌ర్లు రెచ్చి పోయారు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల కు చుక్క‌లు చూపించారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి కేవ‌లం 155 ర‌న్స్ చేసింది.

అనంత‌రం 156 ప‌రుగుల లక్ష్యాన్ని 17.3 ఓవ‌ర్ల‌లో పూర్తి చేశారు సంజు శాంస‌న్ , కార్తీక్ శ‌ర్మ‌. ఈ ఇద్ద‌రూ క‌లిసి మూడో వికెట్ కు రికార్డు భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. సంజు శాంస‌న్ 52 బాల్స్ ఎదుర్కొని 87 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు ఉన్నాయి. త‌న‌కు తోడుగా కార్తీక్ శ‌ర్మ సూప‌ర్ షో చేశాడు. త‌ను 31 బంతులు ఆడి 41 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా త‌ను ఆడిన హెలికాప్ట‌ర్ షాట్ సంచ‌ల‌నంగా మారింది. ఇప్పుడు వైర‌ల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టులో స‌మీర్ రిజ్వీ 24 బంతుల్లో 4 సిక్స‌ర్ల‌తో 40 నాటౌట్ గా నిలిచాడు స్ట‌బ్స్ 31 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 2 సిక్స‌ర్లు ఉన్నాయి. 38 ర‌న్స్ చేశాడు.

Exit mobile version