Telangana : హైదరాబాద్ : మరోసారి తెలంగాణను వర్షాలు ముంచెత్తనున్నాయి. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర వాతావరణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో (Telangana) ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ వ్యవస్థ ప్రభావంతో హైదరాబాద్, తెలంగాణ అంతటా అనేక జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు , భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Telangana Rains Update
శుక్రవారం మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకు వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి, నల్గొండ, గద్వాల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాలలో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. అంతే కాకుండా యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకు అక్కడక్కడ భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా నిన్న హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి నగరమంతా స్తంభించి పోయింది. ఎల్‌బి నగర్, హయత్‌నగర్ , అనేక ఇతర ప్రాంతాలలో రోడ్లపై నీరు నిలిచింది. హయత్‌నగర్‌లో 115 మి.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, జనగాం, యాదాద్రి-భోంగిర్, రంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది.
Also Read : Speaker Gaddam Prasad Shocking Comments : కండువాలు కప్పుకున్నాం కానీ పార్టీ మారలేదు
