ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) సంచలన ప్రకటన చేసింది. గురువారం అధికారికంగా ఇదే ఏడాది లోని ఫిబ్రవరి నెలలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టి20 వరల్డ్ కప్ ను నిర్వహించ బోతోంది. ఇప్పటి వరకు చాలా దేశాలు ఆడబోయే జట్లను ప్రకటించాయి. ముందస్తుగా ఆడాలంటే ఆయా దేశాలకు సంబంధించి ప్రభుత్వాలతో, హోం శాఖల తో పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన చేసింది. వరల్డ్ కప్ లో ఆడబోయే భారత జట్టును ప్రకటించింది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ తో జరిగిన సీరీస్ లో పాట్ కమిన్స్ , హాజిల్ వుడ్ , డేవిడ్ లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియా జట్టు సీరీస్ లలో పాల్గొంది.
ప్రస్తుతం అందిన సమాచారం మేరకు ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లు పూర్తిగా ఫిట్ నెస్ తో ఉన్నట్లు టాక్. ఈ టోర్నీలో శ్రీలంకలో తమ గ్రూప్ మ్యాచ్‌లు ఆడనున్న ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా నాయకత్వం వహిస్తారు. ఫిబ్రవరి 11న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ తో ప్రారంభం కానుంది వరల్డ్ కప్ . ఏసీబీ కమిన్స్ , డేవిడ్ , జోష్ హాజిల్ వుడ్ లను ఈ జట్టులో చేర్చింది ఎంపిక కమిటీ. ఇదిలా ఉండగా జూన్ 2024 నుండి షార్ట్ ఫార్మాట్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని కమిన్స్, తన వెన్ను సమస్యలను నిర్వహించడానికి ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి రెండు యాషెస్ మ్యాచ్‌ల నుండి విశ్రాంతి తీసుకున్నారు,
ఆస్ట్రేలియా జట్టు ఇలా ఉంది. మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానలీ, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఆడనున్నారు.



















