Cubtech Smart Huge Investment in AP : క్యూబిటెక్ స్మార్ట్ సొల్యూష‌న్స్ ఏపీతో ఒప్పందం

భారీ ఎత్తున ఉద్యోగాలు వ‌స్తాయ‌న్న సీఎం చంద్ర‌బాబు

Hello Telugu - Cubtech Smart Huge Investment in AP

Hello Telugu - Cubtech Smart Huge Investment in AP

Cubtech Smart : విశాఖ‌ప‌ట్నం : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంపై దిగ్గ‌జ కంపెనీలు ఫోక‌స్ పెట్టాయి. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు శ‌నివారం నాటితో ముగియ‌నుంది. ఇందులో భాగంగా క్వాంట‌మ్ టెక్నాల‌జీలో కెరీర్ ను నిర్మించు కోవాల‌నే యువ‌తీ యువ‌కుల‌కు , ఔత్సాహికుల‌కు , ప్ర‌తిభావంతుల‌కు తీపి క‌బురు చెప్పింది క్యూరిషి క్వాంట‌మ్ టెక్నాల‌జీ కంపెనీ. వైజాగ్‌లో జరిగిన CII భాగస్వామ్య సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ (STEM) ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రీసెర్చ్ (WISER), క్యూబిటెక్ స్మార్ట్ (Cubtech Smart) సొల్యూషన్స్ ( QKrishi ) క్వాంటంలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్వాంటం టెక్నాలజీ ప్రతిభను హైలెట్ చేయ‌నుంది.

Cubtech Smart Huge Investment in AP

ఈ చొరవ విద్యార్థులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులతో సహా ఆంధ్రప్రదేశ్ అంతటా 50,000 కంటే ఎక్కువ మంది అభ్యాసకులకు ప్రపంచ-ప్రామాణిక క్వాంటం శిక్షణ, వర్చువల్ ల్యాబ్ యాక్సెస్ ,కెరీర్ అవకాశాలను అందిస్తుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. త‌మ ప్ర‌భుత్వం ఇక్క‌డ నెల‌కొల్పే కంపెనీల‌కు పెద్ద ఎత్తున ప్రోత్సాహ‌కాల‌ను, వ‌స‌తి సౌక‌ర్యాల‌ను అంద చేస్తోంద‌ని చెప్పారు. ఈ సహకారం అమరావతి క్వాంటం వ్యాలీని ఆవిష్కరణకు ప్రపంచ ప్రతిభ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా మద్దతు ఇస్తుందన‌డంలో సందేహం లేద‌న్నారు సీఎం. ఈ ఒప్పందం వ‌ల్ల పెద్ద ఎత్తున ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు.

Also Read : Sanju Samson Joined in CSK Sensational : చెన్నై సూప‌ర్ కింగ్స్ లో చేరిన సంజూ శాంస‌న్

Exit mobile version