Shreyas Iyer : ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా జరగిన మూడో వన్డే మ్యాచ్ లో క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నం చేసిన క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఉన్నట్టుండి పడి పోయాడు. ఈ ఘటనలో తనకు తీవ్ర గాయమైంది. అంతర్గతంగా రక్తస్రావం చోటు చేసుకోవడంతో స్ట్రేచర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో చేర్చారు. మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని ఇప్పటికే మేనేజ్ మెంట్ తో పాటు బీసీసీఐ సూచించింది. ఎంత ఖర్చు అయినా సరే తన కోసం ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. ఐపీఎల్ లో తను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు స్కిప్పర్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా అలెక్స్ కారీని అవుట్ చేసేందుకు బ్యాక్ వర్డ్ పాయింట్ నుండి వెనుకకకు పరుగెత్తాడు. అద్బుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఈ ప్రక్రియలో శ్రేయాస్ అయ్యర్ ఎడమ పక్కటెముకకు గాయం అయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Shreyas Iyer Hospitalized
సిడ్నీ లోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా, ఇండియా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. సీరీస్ లో భాగంగా తొలి, రెండో వన్డేలలో ఆతిథ్య ఆసిస్ జట్టు గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. అయ్యర్ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. శ్రేయాస్ గత రెండు రోజులుగా తను ఐసీసీ లో ఉన్నారు. నివేదికల ప్రకారం రక్త స్రావం ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. రక్తస్రావం కారణంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండాల్సిన అవసరం ఉన్నందున, కోలుకునేందుకు రెండు నుండి ఏడు రోజుల వరకు పరిశీలనలో ఉంటాడని సమాచారం. బీసీసీఐ ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తోంది. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి ఢోకా లేదని తెలిపింది.
Also Read : Harish Rao Fired on CM Revanth : ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల సంగతేంటి..?


















