Pujara : ముంబై – ప్రముఖ భారతీయ క్రికెటర్ చతేశ్వర్ పుజారా సంచలన ప్రకటన చేశాడు. తాను భారత క్రికెట్ రంగంలోని అన్ని ఫార్మాట్ ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఆయన చేసిన ప్రకటన క్రికెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది.ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు పుజారా (Pujara). ఈ సందర్బంగా తనకు సపోర్ట్ గా నిలిచినందుకు కుటుంబానికి, స్నేహితులకు, బీసీసీఐకి, తోటి ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
Pujara Announced
ఇదిలా ఉండగగా చతేశ్వర్ పుజారా చివరిసారిగా 2023 లో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారతదేశం తరపున ఆడాడు . టెస్ట్‌లలో భారతదేశ నంబర్ త్రీ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అప్పటి నుండి అతను, అజింక్య రహానే వంటి క్రికెటర్లు భారత జట్టును వదిలి వెళ్ళిన తర్వాత విస్మరించబడ్డాడు. ఈసందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు చతేశ్వర్ పుజారా.
భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నా వంతు ప్రయత్నం చేయడం – దాని నిజమైన అర్థాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం అన్నాడు. అపారమైన కృతజ్ఞతతో నేను అన్ని రకాల భారత క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు పుజారా. ఇప్పటి వరకు తనపట్ల కురిపించిన ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా భారత జట్టు తరపున అనేక మ్యాచ్ లు ఆడాడు. కీలక ఇన్నింగ్స్ లతో జట్టును విజయపథకంలోకి నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు చతేశ్వర్ పుజారా.
Also Read : TTD EO Interesting Updates : వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం



















