20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే మా ప్ర‌ధాన ఎజెండా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ కూట‌మి స‌ర్కార్ ప్ర‌ధాన ఎజెండా ఒక్క‌టేన‌ని, యువ‌త‌కు 20 ల‌క్ష‌ల జాబ్స్ క‌ల్పించ‌డ‌మే ముఖ్య‌మ‌న్నారు. తాము తెచ్చే ప్రతి పాలసీ, ప్రతి ఇన్వెస్ట్‌మెంట్, ప్రతి రిఫార్మ్ ఉద్యోగాల సాధనకేన‌ని అన్నారు. యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగానే మా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు మా పాలసీలు యువత కలలను సాకారం చేస్తాయని చెప్పారు సీఎం. మేము రాష్ట్రంలో సెక్టార్-బేస్డ్ క్లస్టర్ మోడల్ తో అభివృద్ధికి బాటలు వేస్తున్నాం అన్నారు. ప్రతి రీజియన్ స్థిరమైన అభివృద్ధి సాధిస్తూ స్కేలబుల్ ఉద్యోగాలు సృష్టిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, ఐటీ హబ్‌లు, ఫార్మా జోన్‌లు, గ్రీన్ ఎనర్జీ కారిడార్లు… ఇలా 22 క్లస్టర్లు జాబ్ ఇంజిన్‌గా పనిచేస్తాయ‌ని వెల్ల‌డించారు.

ఇదే ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించే డీసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్, ఇన్‌క్లూసివ్ గ్రోత్ విధానం అని పేర్కొన్నారు. తాము కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, యువతకు మంచి కెరీర్, జీవనోపాధి, భవిష్యత్తును ఇస్తున్నాం అని అన్నారు. ఇది భారతదేశ అభివృద్ధి మంత్రం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్‌మెంట్లు వేగవంతం చేసి, మిలియన్ల యువతకు ఉపాధి కల్పిస్తాం. ఇలాంటి సక్సెస్ స్టోరీలు భారతదేశాన్ని ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ గా మారుస్తాయన్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. వేగం ఎంచుకునే కంపెనీలు, ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంటాయని తెలిపారు.

Exit mobile version