CPI Narayana : అమరావతి – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. పంటల సాగు సీజన్ అయి పోయిన తర్వాత రైతులను పరామర్శించడం దారుణమన్నారు. సమస్యలను రాజకీయం చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. వేల మందితో వెళ్లడం, ప్రచారం చేసుకోవడం తప్పితే చేసేదీ ఏమీ ఉండదన్నారు. పర్యటనల పేరుతో బల ప్రదర్శనలకు దిగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ సభ్య సమాజం హర్షించదన్నారు.
CPI Narayana Slams YS Jagan
అసలు రాజకీయాలు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఐ నారాయణ (CPI Narayana). తాము ప్రజా ప్రతినిధులమన్న సోయి లేకుండా మాట్లాడుతుండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి భరోసా కల్పించాల్సింది పోయి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయడం ఎవరూ హర్షించరన్నారు. ఎంత సేపు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నారాయణ.
ఇకనైనా వీరిని కట్టడి చేయాలని లేక పోతే ఈ విష సంస్కృతి మరింత పేట్రేగి పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు .ఇప్పటికే అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యమై పోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాజకీయాలలో ఎందుకు ఉన్నామా అన్న భావన కలుగుతోందన్నారు. సభ్య సమాజం ఏమని అనుకుంటుందోనన్న సోయి లేకుండా కామెంట్స్ చేస్తే ఎలా అని వాపోయారు సీపీఐ నారాయణ.
Also Read : Minister Seethakka Fired on KTR : కేటీఆర్..పోలీస్ రాజ్యం ఎక్కడుందో చెప్పు
















