CPI Narayana : హైదరాబాద్ – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, ఈ విషయం కమిషన్ తేల్చిందన్నారు. సీబీఐ విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంగళవారంద నారాయణ మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్ల పాటు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని పాలించిన మాజీ సీఎం కేసీఆర్ ఏం చేశారో ఇప్పుడు పూర్తిగా అర్థమైందన్నారు ప్రజలకు. ఇకనైనా వాస్తవాలను గుర్తించి, బేషరతుగా తప్పు ఒప్పుకోవాలని కోరారు.
CPI Narayana Shocking Comments on Kaleshwaram
అభివృద్ది పేరుతో విధ్వంసం కొనసాగిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల. ఓ వైపు ఖజానాలో డబ్బులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి నిత్యం ఢిల్లీకి వెళ్లి వస్తున్నారని, ఇదంతా ప్రజల డబ్బు కాదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కోట్లాది రూపాయలను అందాల పోటీల పేరుతో తగలేశారని, ఇదేనా ప్రభుత్వం చేయాల్సిన పనులు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలకులకు స్వంత ప్రయోజనాలు తప్పా ప్రజల బాగోగుల గురించి పట్టించుకునే సమయం ఎక్కడుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీకి వెళ్లి రావడం తప్పా ఏం చేస్తున్నారనేది ఇప్పటి వరకు తెలియడం లేదన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర సర్కార్ కు 650 పేజీలతో కూడిన పూర్తి నివేదికను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ సమర్పించారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Also Read : Seediri Appalaraju Warning to MLA Sireesha : గౌతు శిరీష జర నోరు జాగ్రత్త – సీదిరి అప్పలరాజు


















