CPI Narayana Alarming : ధ‌ర్మ‌స్థ‌లను స‌ర్కార్ స్వాధీనం చేసుకోవాలి

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ

Hello Telugu - CPI Narayana Alarming

Hello Telugu - CPI Narayana Alarming

CPI Narayana : చిత్తూరు జిల్లా – సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ (CPI Narayana) షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్నాటకలోని ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందన్నారు. ఆ ట్రస్ట్ చైర్మన్ ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేసిందని ఆరోపించారు. దాదాపు 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేసి అక్కడే పూడ్చిపెట్టారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి SIT వేసింద‌ని, అదే బీజేపీ సర్కార్ ఉంటే SIT ఏర్పాటు చేసేది కాదన్నారు. శ‌నివారం నారాయ‌ణ తిరుప‌తిలో మాట్లాడారు. స్మశాన వాటికలో ఉన్నట్లు అక్కడ అన్నీ పుర్రెలు, ఎముకలు బ‌య‌ట ప‌డుతున్నాయ‌ని వాపోయారు. త‌మ పార్టీకి చెందిన నాయ‌కులు గ‌తంలో ధ‌ర్మ‌స్థ‌ల‌లో చోటు చేసుకున్న దారుణాల గురించి అడ్డుకున్నార‌ని, ఆందోళ‌న‌లు చేప‌ట్టార‌ని చెప్పారు.

CPI Narayana Key Comments

త‌ను తెగించి ఎంపీగా పోటీ చేసినందుకు 15 ఏళ్ల త‌న కూతురును రేప్ చేసి చంపేశార‌ని వాపోయారు సీపీఐ నారాయ‌ణ‌. ధర్మస్థల ట్రస్ట్ ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా గ‌త కొన్ని రోజుల నుంచి ధ‌ర్మ‌స్థ‌ల లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల గురించి పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. దీనిపై క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖ డిజిట‌ల్ మీడియా సంస్థ ది న్యూస్ మిన‌ట్ స్పెష‌ల్ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది. పూర్తి ఆధారాలతో స‌హా. ఈ స‌మ‌యంలో ధ‌ర్మ‌స్థ‌ల‌లో గ‌తంలో పారిశుధ్య కార్మికుడిగా ప‌ని చేసిన ఓ వ్య‌క్తి ఇక్క‌డి దారుణాల గురించి పూస‌గుచ్చిన‌ట్లు పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. త‌న చేతుల‌తో ఎంతో మందిని ఇక్క‌డ పూడ్చి పెట్టానంటూ కంట త‌డి పెట్టాడు.

Also Read : KTR Shocking Comments : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల‌పై వేటు వేయాలి

Exit mobile version