CP Sajjanar : హైదరాబాద్ : సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) కొలువు తీరడంతో హైదరాబాద్ లోని రౌడీ షీటర్ల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తనదైన మార్క్ పోలీసింగ్ కొనసాగుతోంది. రౌడీ షీటర్లకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో నగరంలోని రౌడీ షీటర్లు గప్ చుప్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు సీపీ. ఇక వీసీ సజ్జనర్ రాకతో రౌడీ షీటర్లలో వణకు మొదలైంది. అందరూ అనుకున్నట్టుగానే తన మార్క్ పోలీసింగ్‌ను ఆయన ప్రారంభించారు. చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద జరిగిన సంఘటనలో సజ్జనర్ వ్యవహారించిన తీరు ఇదే విషయాన్నిస్ఫష్టం చేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది.
CP Sajjanar Shocking Rowdy Sheeters
రౌడీషీటర్లు, ఈవ్ టీజర్లు, పిక్ పాకెటర్లు వంటి నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని, చట్టాన్ని అతిక్రమించే వారెవరైనా సరే నేరం చిన్నదా పెద్దదా అన్న తేడా లేకుండా కఠిన చర్యలు తప్పవనే సంకేతాన్ని సజ్జనార్ ఇచ్చారు. ఇదిలా ఉండగా నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే రౌడీ షీటర్లలో భయం పట్టుకుంది. చాలా మంది రౌడీషీటర్లు ఇప్పటికే మౌనం వహించారు. కొందరైతే ఏకంగా నగరాన్ని వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు సన్నద్దమయ్యే పరిస్థితి వచ్చింది.
చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద జరిగిన సంఘటనలో రౌడీ షీటర్ మహ్మద్ ఓమర్ విషయంలో వ్యవహారించిన తీరుతో సజ్జనార్ స్పష్టమైన హెచ్చరికతో, నేరగాళ్లకు ఇకనుంచి హైదరాబాద్‌లో సేఫ్ జోన్ లేదన్న విషయం స్పష్టం అయ్యింది. సీపీ నాయకత్వంలో హైదరాబాద్ సిటీ పోలీస్ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో మరింత దృఢంగా ముందుకు సాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా వీసీ సజ్జనార్ కు పేరుంది. దీంతో నేరాలకు పాల్పడే వ్యక్తులకు భయం పట్టుకుంది.
Also Read : K Kavitha New Innovation : ఎమ్మెల్సీ కవితక్క జనం బాట షురూ
















