H-1B Visa : అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆయన తీసుకున్న చర్యలు మరింత ఆగ్రాహాన్ని తెప్పించేలా చేశాయి. గతంలో బైడెన్ సర్కార్ హయాంలో కేవలం హెచ్ 1 బి వీసా (H-1B Visa) రుసుము 1500 డాలర్లు మాత్రమే ఉండేది. కానీ ట్రంప్ వచ్చాక దానిని 1,00,000 డాలర్లకు ఫీజు పెంచారు. పెంపును సవాల్ చేస్తూ శాన్ ఫ్రాన్సిస్కో లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, మత పరమైన సమూహాలు, విశ్వ విద్యాలయ ప్రొఫెసర్లు, ఇతరుల కూటమి ఈ ప్రణాళికను ఆపడానికి ఒక ఫెడరల్ దావాను దాఖలు చేసింది. ఈ తాజా డెసిషన్ యజమానులు, కార్మికులు, సమాఖ్య సంస్థలను గందరగోళంలోకి నెట్టి వేసిందని దావాలో పేర్కొన్నారు.
H-1B Visa Fee Hike Case
ఇక హెచ్ -1బి వీసా ప్రోగ్రమ్ తక్కువ జీతం, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులతో అమెరికన్ కార్మికులను భర్తీ చేయడానికి బదులుగా ఉద్దేశ పూర్వకంగా దోపిడీ చేయబడిందంటూ అందుకే ఫీజు పెంచాల్సి వచ్చిందని ఉత్తర్వులలో పేర్కొంది అమెరికా ప్రభుత్వం. ఈ మార్పులు 36 గంటల్లో అమల్లోకి రావాలని నిర్ణయించారు, ఇది యజమానులలో భయాందోళనలకు కారణమైంది. వారు తమ కార్మికులను వెంటనే అమెరికాకు తిరిగి రావాలని ఆదేశించారు. సహాయం లేకుండా, ఆసుపత్రులు వైద్య సిబ్బందిని కోల్పోతాయి, చర్చిలు పాస్టర్లను కోల్పోతారు. తరగతి గదులు ఉపాధ్యాయులను కోల్పోవడం ప్రారంభం అవుతుందని , దీని ద్వారా ఈ ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని పిటిషన్ లలో పేర్కొన్నారు.ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు కీలకమైన ఆవిష్కర్తలను కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి డెమోక్రసీ ఫార్వర్డ్ ఫౌండేషన్, జస్టిస్ యాక్షన్ సెంటర్.
Also Read : Deputy CM Pawan Important Comments : వరద ప్రభావిత ప్రాంతాలపై డిప్యూటీ సీఎం ఆరా


















