ప‌త్తి రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి

కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు లేఖ

hellotelugu-MinisterAtchannaidu

అమ‌రావ‌తి : పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కి లేఖ రాశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి అచ్చెన్నాయుడు. మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్ సీజన్‌లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు, 8 లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశామ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే CM APP మరియు ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తోంది.

కేంద్రం ప్రవేశపెట్టిన క‌ప‌స్ కిసాన్ యాప్ ను రాష్ట్ర సీఎం యాప్ తో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అచ్చెన్నాయుడు. రైతుల వివరాలు రియల్ టైమ్‌లో సమన్వయం అయ్యేలా చేయాల‌ని సూచించారు. రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలన్నారు. రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా. L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అచ్చెన్నాయుడు. క‌ప‌స్ కిసాన్ యాప్ కోసం గుంటూరులో ప్ర‌త్యేక సాంకేతిక సిబ్బందిని నియ‌మించాల‌ని కోరారు.

Exit mobile version