యుద్ద ప్రాతిప‌దిక‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం

నిప్పులు చెరిగిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-Amaravathi

అమ‌రావ‌తి : సీఎం చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ కామెంట్స్ చేశారు జ‌గ‌న్ రెడ్డిపై. అమరావతి పేరు పలకడం కూడా ఇష్టం లేని వారికి పాలించే అర్హత ఎక్కడిది..? అని ప్ర‌శ్నించారు. జగన్ లాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదన్నారు. మొన్నటి వరకూ మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. విజయవాడ, గుంటూరు సమీపంలో రాజధాని కట్టేందుకు నేను ఇచ్చిన పిలుపుతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. దేవతల రాజధాని అమరావతి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన నీరు, మట్టి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. హైకోర్టు, సుప్రీంకోర్టు అమరావతికి మద్దతుగా నిలిచాయి. 2019కి ముందు బాబాయిని చంపి ఆ నేరాన్ని నాపై వేశాడు. నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పత్రికలో తప్పుడు కథనం రాశారు.

అమరావతిపై కక్ష గట్టి రైతుల త్యాగాలకు విలువ లేకుండా చేశారు. అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చు అని అసత్య ప్రచారం చేస్తున్నాడు. అమరావతి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. మహిళా రైతులను ఇబ్బందులు పెట్టారు. మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ లతో చిత్రీకరించారు. వారిని జట్టు పట్టుకుని బయటకు లాగారు. లాఠీలతో కొట్టారు. న్యాయస్థానం టూ దేవస్థానం కార్యక్రమం చేపడితే రోడ్డుపై భోజనం చేయనివ్వకుండా హింసించారు. అమరావతి నుంచి అరసవిల్లి వెళ్లాలంటే వారిపై దౌర్జన్యం చేశారు. మహిళల గురించి, నా భార్య గురించి వ్యక్తిగత దూషణలు చేశారు. గత ఐదేళ్లలో మహిళలను వాళ్లకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి మహిళలు వీరోచితంగా పోరాడారు. చివరకు న్యాయం గెలిచింది. అమరావతి అజరామరం. అమరావతే ఏపీ రాజధాని అని రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తే ఒకే ఒక్క సైకో పార్టీ సపోర్ట్ చేయలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

Exit mobile version