Jubilee Hills : హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. ఈసారి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 200 డ్రోన్లను వినియోగించినట్లు తెలిపారు సీపీ. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు వచ్చాయి. ఈ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలుపు వైపు దూసుకు పోతోందని అంచనాలు వ్యక్తం అయ్యాయి.
Jubilee Hills By Election Update
చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌కి 46%, బీఆర్ఎస్‌కి 41%, బీజేపీకి 6% ఓట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా స్మార్ట్‌పోల్ సంస్థ అంచనా ప్రకారం కాంగ్రెస్‌కి 48.2%, బీఆర్ఎస్‌కి 42.1%, బీజేపీకి 8% ఓటు శాతం వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తోంది. తుది ఫలితాలు ఎన్నికల లెక్కింపు అనంతరం వెలువడనున్నాయి. ఈనెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. సెంటిమెంట్ ఏ మాత్రం పని చేయలేదని సర్వే సంస్థల సర్వేల ద్వారా వెల్లడైంది.
ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పోటా పోటీగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ , బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశారు. కానీ చివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే పోటీ జరిగింది.
Also Read : Minister Anitha Important Update : ఇండస్ట్రియల్ పార్కుతో 6 వేల ఉద్యోగాలు


















