People Shocking Bigg Boss Show : మాటీవీ బిగ్ బాస్ షోపై ఫిర్యాదు

త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్న షో

Hello Telugu - People Shocking Bigg Boss Show

Hello Telugu - People Shocking Bigg Boss Show

Bigg Boss : హైద‌రాబాద్ : మా టీవీ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ (Bigg Boss) షో పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్. సమాజాన్ని బిగ్ బాస్ షో త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ద‌ని, దీనిని వెంట‌నే నిలిపి వేయాల‌ని కోరారు. బిగ్ బాస్ షో కు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేద‌న్నారు. ఈ షో ద్వారా నేటి యువ‌తీ యువ‌కుల‌కు ఏం మెస్సేజ్ ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. కావాల‌ని కుటుంబ విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చిన వారిని, వాటిని పాటించని వారిని ఎంచుకుంటున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌భ్య స‌మాజం, కుటుంబం సిగ్గు ప‌డే విధంగా షోను నిర్వ‌హిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

Case Filed on Bigg Boss Show

త‌క్ష‌ణ‌మే బిగ్ బాస్ షోను నిలిపి వేయాల‌ని, దీనిపై , షో నిర్వాహ‌కుల‌పై, స్టార్ మా పై ప్ర‌భుత్వం కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటక లో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చెయ్యాల‌ని డిమాండ్ చేశారు. అక్కినేని నాగార్జున సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చెయ్యాలని సూచించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని ఏం సాధించ బోతున్నారంటూ మండిప‌డ్డారు. క‌నీసం క‌ర్ణాట‌క‌ను చూసైనా తెలంగాణ ప్ర‌భుత్వం నేర్చుకోవాల‌ని పేర్కొన్నారు.

Also Read : Hero Chiranjeevi-Tilak Varma : క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌కు చిరంజీవి స‌త్కారం

Exit mobile version