Rohin Reddy : హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ చేసిన ఆరోపణల ఆధారంగా తక్షణమే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు రోహిన్ రెడ్డి (Rohin Reddy), మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు , మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేయడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇప్పుడు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.
Rohin Reddy Case Updates
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు , ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరిగి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు జైపాల్ యాదవ్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందన్నారు. వ్యవస్థలన్ని నిర్వీర్యమై పోయాయని వాపోయారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కాంగ్రస్ అంటేనే మోసం తప్పా మరోటి కాదన్నారు. రోహిన్ రెడ్డి, సుమంత్ ల మధ్య వాటాల్లో వచ్చిన తేడాలే బయటకు పడేలా చేశాయన్నారు. మంత్రి కూతురు సుష్మితా పటేల్ ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడటం బాగుందన్నారు. మొత్తంగా రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని తేలి పోయిందన్నారు.
Also Read : CM Revanth Reddy Shocking Decision : తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు















