బిగ్ బాస్ 10లో కెప్టెన్సీ కోసం పెరిగిన పోటీ

మ‌రో వైపు సంచ‌ల‌నంగా మారిన రీ ఎంట్రీ ట్విస్ట్

hellotelugu-BigBooss10

హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ 10 రియాల్టీ షో రోజు రోజుకు ఉత్కంఠ‌ను రేపుతోంది. ట్విస్ట్ ల‌తో హోరెత్తిస్తోంది. ఇక బిగ్ బాస్ 10వ రోజు ఎపిసోడ్ గణేష్ చతుర్థి వేడుకలు, కెప్టెన్సీ టాస్క్ తో పాటు గత వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకు సంబంధించిన ఒక కీలకమైన మలుపుతో సాగింది. ముందు రోజు జరిగిన నామినేషన్ల గురించి ఇంటి సభ్యులు చర్చించు కోవడంతో ఎపిసోడ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ముఖేష్ గౌడ వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లారు. వర్షిణితో సమయం గడపడం గురించి దేబజాని మోడక్ సరదాగా ముఖేష్‌ను ప్రశ్నించడం ఇంట్లో కొన్ని సరదా క్షణాలకు దారితీసింది.

బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లు అందరూ కలిసి వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు. నిర్వాహకులు పూజకు అవసరమైన సామగ్రిని సమకూర్చగా, ఇంటి సభ్యులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. త్రిగుణ్, దేబజాని, అమన్, శాలిని, ముఖేష్, రోహిత్, ఝాన్సీ , రామ్‌ప్రసాద్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. బెలూన్ టాస్క్‌లో భాగంగా, కంటెస్టెంట్లు ఇచ్చిన పదాలను సరిగ్గా స్పెల్లింగ్ చెప్పాల్సి ఉంటుంది. సరైన సమాధానం చెప్పిన వారు మరొక కంటెస్టెంట్ బెలూన్‌ను పగలగొట్టి అందుకు గల కారణాన్ని చెప్పాలి.

ఈ క్రమంలో మొదట త్రిగుణ్, ఆ తర్వాత రోహిత్, రామ్‌ప్రసాద్, దేబజాని, శాలిని , ముఖేష్ ఎలిమినేట్ అయ్యారు. చివరగా ఝాన్సీ, అమన్ పోటీలో మిగిలారు. వీరి మధ్య కెప్టెన్సీ పోటీ తదుపరి ఎపిసోడ్‌లో కొనసాగుతుంది. గత వారం ఎలిమినేట్ అయిన చైత్ర , చరణ్‌లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన మలుపు కూడా ఈ ఎపిసోడ్‌లో చోటుచే సుకుంది. వారిలో ఒకరిని తిరిగి ఇంట్లోకి తీసుకువచ్చే అవకాశాన్ని బిగ్ బాస్ ప్రేక్షకులకు కల్పించారు. ప్రేక్షకుల నుండి ఎక్కువ ఓట్లు పొందిన కంటెస్టెంట్ తిరిగి షోలోకి వస్తారు.

Exit mobile version