Collector Siri : కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న వోల్వో బస్సు దగ్ధం ఘటన కేసులో కీలక వివరాలు వెల్లడించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి. ఇప్పటి వరకు ఈ బస్సులో 41 మంది ప్రయాణం చేయగా 21 మంది సురక్షితంగా బయట పడ్డారు. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మందిని గుర్తించారు. మరికొందరిని డీఎన్ఏ సాయంతో గుర్తిస్తామన్నారు కలెక్టర్. ఇదిలా ఉండగా బస్సు ప్రయాణికుల జాబితాను ప్రకటించారు. వీరిలో అశ్విన్‌రెడ్డి(36) , జి.ధాత్రి(27), కీర్తి(30), పంకజ్(28), యువన్ శంకర్‌రాజు(22), తరుణ్(27), ఆకాశ్(31), గిరిరావు(48), బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా(27) పిల్వామిన్ బేబి(64) ఉన్నారు.
Kurnool Collector Siri Key Update
ఇంకా వీరితో పాటు కిశోర్ కుమార్(41), రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నారు. రమేష్(30),
అనూష(22), మహ్మద్ ఖైజర్(51), దీపక్ కుమార్ (24) , అన్డోజ్ నవీన్‌కుమార్(26), ప్రశాంత్(32), ఎం.సత్యనారాయణ (28), మేఘనాథ్ (25), వేణు గుండ (33), చరిత్(21), చందన మంగ(23), సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28), సూర్య(24), హారిక(30), శ్రీహర్ష(24) , శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26), కె.అశోక్(27), ఎం.జి.రామారెడ్డి(50 ), ఉమాపతి(32), అమృత్ కుమార్(18), వేణు గోపాల్‌రెడ్డి(24) ఉన్నారని తెలిపారు కలెక్టర్ సిరి.
Also Read : DY CM Pawan Kalyan Strong Assurance : మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ భరోసా
















