తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎం సుడిగాలి ప‌ర్య‌ట‌న

పంట‌ల‌ను కోల్పోయిన రైతుల‌కు అండ‌గా ఉంటాం

hellotelugu-ApCM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ముర‌సు తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లెళమూడిలో నీట మునిగిన వరి పంటను పరిశీలించారు. నీట మునిగి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. పంటలపై రైతులు ఎంత మేర పెట్టుబడులు పెట్టారని అడిగి తెలుసుకున్నారు. కరవు పరిస్థితుల్లో కూడా నీరు ఇచ్చి పంటల్ని ఆదుకున్నారని ముఖ్యమంత్రికి తెలిపారు బాధిత రైతులు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ దెబ్బ తీసిందంటూ ఆవేదన చెందారు. పంటలీ బీమా చేయించుకున్నారా అని రైతులను ప్ర‌శ్నించారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంట భీమాతో పాటు ప్రభుత్వం ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ రైతులను ఆదుకుంటుందని చెప్పారు.

పంటల బీమా చేయించుకుంటే కలిగే ప్రయోజనాలపై ఎత్తున అవగాహన కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు ఈ సంద‌ర్బంగా . అనంత‌రంం జిల్లెలమూడి వంతెన వద్ద వరద ప్రవాహాలను పరిశీలించారు.
వాగు ఉధృతి కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగినట్టు తెలిపారు అధికారులు. ఆయా ప్రాంతాల‌లో పంట‌లు కోల్పోయిన వారిని ప‌రామర్శించ‌డ‌మే కాకుండా వారికి భ‌రోసా క‌ల్పించిన‌ట్లు సీఎంకు వివ‌రించారు మంత్రి కొలుసు పార్ధసారధి, స్థానిక ప్రజా ప్రతినిధులు. గ్రామానికి వచ్చిన సీఎం ను కలిశారు జిల్లెళమూడి అమ్మ భక్తులు. అనంత‌రం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే అర్న‌బ్ తుపాను ఏపీ రాష్ట్రాన్ని తీవ్ర న‌ష్టాల‌కు గురి చేసింద‌న్నారు. తుపాను దెబ్బ‌కు ఏకంగా 4,600 కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లింద‌న్నారు.

Exit mobile version