హైదరాబాద్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. శాసన సభలో తను మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. ఒక ఉన్నత పదవిలో ఉన్నానన్న సోయి లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్ దళితుడు అంటున్నాడని, అలా అనడానికి సిగ్గుండాలని అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తాము స్పీకర్ ని దళితుడిగా చూడలేదని, ఉన్నతమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తిగా చూశామన్నారు. రేవంత్ రెడ్డి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కులాల ప్రస్తావన తీసుకొచ్చాడని ఆరోపించారు.
అటెన్షన్ డైవర్షన్ కోసమే హౌస్ ఆర్డర్లో లేనప్పుడు, కాలే యాదయ్య, దానం నాగేందర్, కడియం శ్రీహరికి మైక్ ఇచ్చి మమ్మల్ని తిట్టించారని మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భట్టి విక్రమార్క గురించి గొప్పగా చెప్పాడు.. కాబట్టి భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిని చేయమని తాము కూడా కోరుతున్నాం అన్నాడు.కడియం శ్రీహరి అసెంబ్లీలో నా వెంట్రుక కూడా పీక్కోలేరు అని వ్యాఖ్యలు చేశాడని, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేవలం మీది ఏ పార్టీ అని అడిగాడని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి పంపడానికి కూడా ఇప్పటి వరకు కమిటీలు వేయలేదన్నారు మాజీ మంత్రి . ముందు అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీకి పంపించాలన్నారు.
