CM Revanth Reddy : హైదరాబాద్ : ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అయిన ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి సర్కార్ పరంగా పూర్తి మద్దతు ఇచ్చింది. ఐఎస్ఆర్ఎల్ సహ వ్యవస్థాపకులు , బిగ్‌రాక్ మోటార్ స్పోర్ట్స్ సహ యజమాని సమక్షంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కీలకమైన లీగ్ పోటీలు డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరగనున్నాయి. రెండో రౌండ్ లీగ్ ను పోస్టర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు ఎ. రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Inaugurate
అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు, ప్రపంచ స్థాయి రేసింగ్ మౌలిక సదుపాయాలు, అభిమానులకు అద్భుతమైన క్రీడా అనుభవాన్ని అందించే ఈ చారిత్రాత్మక కార్యక్రమం తెలంగాణలో మొదటిసారిగా ఈ స్థాయిలో ప్రపంచ సూపర్‌క్రాస్ రేసింగ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. క్రీడలు, పర్యాటక రంగంతో సహా అన్ని రంగాలలో ఆవిష్కరణ, శ్రేష్ఠతను పెంపొందించే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం భారతదేశంలో అత్యంత ఉత్కంఠ భరితమైన క్రీడా ప్రదర్శనలలో ఒకటిగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఐఎస్ఆర్ఎల్ సహ వ్యవస్థాపకుడు ఈషాన్ లోఖండే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
Also Read : Ambati Rambabu Shocking Comments on CM : అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ దందా

















