CM Revanth Reddy : హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది 2026లో తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. దీనిని రాష్ట్ర పండుగగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ లో ఓ ఛానల్ నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గత 14 ఏళ్లుగా ఛానల్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో మరింత భక్తి భావం పెంపొందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Will Start
హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ కోటి దీపోత్సవం ప్రస్తుతం రాష్ట్ర , దేశ సరిహద్దులు దాటి ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేస్తోందన్నారు. తెలంగాణ సర్కార్ తరపున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఆధ్యాత్మికత అనేది మనసుకే కాదు శరీరారికి కూడా స్వాంతన చేకూరుస్తుందన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో తన పుట్టిన రోజు సందర్బంగా గడపడం తనకు జీవిత కాలమంతా గుర్తుండి పోతుందన్నారు సీఎం. ఆశీర్వదించిన భక్తకోటికి నా అభినందనలు, శుభా కాంక్షలు అని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా తప్పకుండా నిర్వహించి తీరుతామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాస్తామని చెప్పారు.
Also Read : KTR Shocking Comments : ఆకు రౌడీలను రేవంత్ రెడ్డి కాపాడలేడు



















