CM Revanth Reddy : హైదరాబాద్ : రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి ఎంపీలు పార్లమెంట్ లో గళం విప్పాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఈ రోజు ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై రాష్ట్ర ఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్ని పార్టీల ఎంపీలతో ఈ సమావేశాన్ని నిర్వహించడ జరిగిందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్‌లో సవరణ అత్యవసరం అని స్పష్ం చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటులో అడ్జర్న్‌మెంట్ మోషన్ లేదా ప్రశ్నోత్తరాల ద్వారా బలంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి.
CM Revanth Reddy Key Comments
అన్ని పార్టీల ఎంపీలతో కలిసి తనతో పాటు యావత్తు రాష్ట్ర కేబినెట్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని , ఈ విషయాన్ని ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి అర్థం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని కుండ బద్దలు కొట్టారు ఎ. రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా కలిసి వినతి పత్రం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని తక్షణం అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సీఎం. విద్యుత్, నీటిపారుదల, GST తదితర శాఖలకు సంబంధించిన పెండింగ్ నిధుల వివరాలు అక్కడ సిద్ధంగా ఉంటాయన్నారు.
Also Read : TG High Court Shocking Hydraa Commissioner : కోర్టుకు హాజరవుతావా లేక జైలుకు వెళతావా

















