మీడియా పార్టీల‌కు కొమ్ము కాస్తే ఎలా..?

నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

hellotelugu-CM

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌లు త‌న‌కు స‌వాల్ తో కూడుకుని ఉన్న‌వ‌న్నారు. ఈ ఎన్నిక‌లు పార్టీకి బ‌ల‌మైన పునాదుల‌ని అన్నారు. సీఎం ఇవాళ మీడియాతో మాట్లాడారు. బిజెపి 12 ఏండ్లు కేంద్రంలో కొన‌సాగుతోంద‌ని, బిఆర్ఎస్ 10 ఏండ్లు పాలించింద‌ని ,కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్త‌యింద‌ని అన్నారు. అయితే ఈనెల 13న ఫలితం రెఫరెండం కానే కాద‌న్నారు రేవంత్ రెడ్డి. నాకు టెంపర్ మెంట్ ఎక్కువ అన అన్నారు. చాలాసార్లు దాన్ని కంట్రోల్ చేసుకునేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటానని చెప్పారు.

సిఎంగా నాభాష (మాటలు) తప్పు పడుతున్న వారు మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని “రండ” అన్నప్పుడు ఎందుకు స్పందించ లేద‌ని ప్ర‌శ్నించారు. ఆమాట అనవచ్చునా అని నిల‌దీశారు. జర్నలిస్టులు ఉద్యోగులుగా ఏ సంస్థలో పనిచేస్తున్నా నా స్నేహంలో తేడా అనేది ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు (వరంగల్, హైదరాబాద్) మోసం చేసిందే కేసిఆర్ కాదా మ‌రి మీరు ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని మండిప‌డ్డారు రేవంత్ రెడ్డి. మీడియా రాజకీయ పార్టీల తరపున కాకుండా ప్రజల పక్షాన ఉండాల‌ని అన్నారు. ఒక పెద్ద పేపర్ నా మాటలను తప్పుగా ప్రచురించిందని ఆరోపించారు. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా అని ఫైర్ అయ్యారు.

Exit mobile version