CM Revanth Reddy : హైదరాబాద్ – సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ పూర్తి నివేదికను సర్కార్ కు అందజేశారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ , హరీశ్ రావు, ఈటెల రాజేందర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురి నిర్వాకం కారణంగా కాళేశ్వరం ఎందుకూ పనికి రాకుండా పోయిందన్నారు సీఎం. కేసీఆర్ హయాంలో నిర్మాణం జరిగిన మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోయిందంటూ ఆరోపించారు.
CM Revanth Reddy Slams
అన్నారం..సుందిల్ల లో పగుళ్లు వచ్చాయని చెప్పారు. లక్ష కోట్ల ప్రాజెక్టు కూలిపోవడం తో విచారణ చేస్తాం అని తాము ముందే చెప్పామన్నారు. మాట ప్రకారం కమిషన్ విచారణ కి ఆదేశించామని చెప్పారు. తాము ఏర్పాటు చేసిన కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. పలువురిని విచారించింది. ఇందులో ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులను పిలిపించిందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికను పరిశీలించి, అధికారులు 60 పేజీల సారాంశం రూపొందించారని వెల్లడించారు.
కేబినెట్‌కు సమర్పించిన ఈ సంక్షిప్త నివేదికలో పలువురి నాయకుల పేర్లను ప్రస్తావించారని తెలిపారు సీఎం. ఇందులో ప్రత్యేకంగా 32 సార్లు కేసీఆర్ , 19 సార్లు హరీశ్ రావు, 5 సార్లు ఈటెల రాజేందర్ పేర్లను ఉటంకించారని స్పష్టం చేశారు. ఆనాడు పాలక వర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టవద్దంటూ నిపుణుల కమిటీ సూచించినా పట్టించు కోలేదన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఆ నివేదిక ను తొక్కి పెట్టారని ఘోష్ రిపోర్ట్ తేల్చి చెప్పిందన్నారు.
Also Read : Telangana CS Effective – Kaleshwaram : కాళేశ్వరం కమిషన్ నివేదికలో సీఎస్ ప్రస్తావన
















