CM Revanth Reddy : హైదరాబాద్ : రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటి పైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారిగా విశ్లేషణలు జరగాలని స్పష్టంగా చెప్పారు. ‘కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవల్యూషన్’ కు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాసిన లేఖ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రి ప్రస్తావించిన అంశాల గురించి ఏకరువు పెట్టారు. ఆ అంశాల గురించి ఉన్నతాధికారులకు వివరించారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల వారిగా సమగ్రమైన వివరాలతో విశ్లేషణలు జరగాలని అన్నారు సీఎం.
CM Revanth Reddy Key Comments
రాష్ట్రం లోని అన్ని డ్యామ్‌లపైనా స్టేటస్ రిపోర్ట్‌లను తయారు చేయాలని ఆదేశించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితి పైనా ఆరా తీశారు. బ్యారేజీల మరమ్మత్తులకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల వారీగా రూపొందించే పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా ప్రాజెక్టుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే విధంగా ఈ ప్రణాళికలు సిద్ధం కావాలని చెప్పారు.
Also Read : CM Revanth Reddy Strong Focus on Jubilee Hills : జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మంత్రులకు బాధ్యతలు

















