CM Revanth Reddy : హైదరాబాద్ : పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్టా రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం కీలక సూచనలు చేశారు. నాణ్యమైన విద్యను అందించడమే తమ సర్కార్ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ బడి బయట ఉండేందుకు వీలు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలని అన్నారు.
CM Revanth Reddy Key Comments
ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చి దిద్దాలని, అందుకు అవసరమైన నిధులను తాము మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు సీఎం. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని అన్నారు. ఇందుకు విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని ఆదేశించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాని సూచించారు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 2026 జూన్ లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలన్నారు.
Also Read : Jadeja Interesting Comments : మంత్రి పదవి దక్కడంపై జడేజా హ్యాపీ


















