CM Revanth Reddy : హైదరాబాద్ : మొంథా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పంటలను సాగు చేశారని, అవి నాశనం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిశా నిర్దేశం చేశారు. ఎక్కువ పంటలు వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న , తదితర పంటలను సాగు చేశారన్నారు. వేలాది ఎకరాలు నీటి పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం ఏశారు సీఎం. సాధ్యమైనంత మేరకు పంటలను కాపాడేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఈ సందర్బంగా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు , సలహాదారులు హాజరయ్యారు.
CM Revanth Reddy Instructions to Officials for Cyclone Effect
ఇదిలా ఉండగా అక్టోబర్ 30వ తేదీ దాకా భారీ ఎత్తున మొంథా తుపాను కారణంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సర్కార్ కు సూచించింది. ఈ నేపథ్యంలో సీఎం రంగంలోకి దిగారు. మరో వైపు ఈనెల 30, 31వ తేదీలలో ఆయన జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో రోడ్ షో చేపట్టనున్నారు. ఇది రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఇక సమీక్ష సందర్బంగా సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న సేకరణ సజావుగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతులకు అసౌకర్యం కలగకుండా సేకరణ కార్యకలాపాలు కొనసాగించాలని, పంట నష్టాన్ని నివారించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో వర్షపాతం, భూ పరిస్థితులపై సమగ్ర నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు.
Also Read : Surya Kumar Yadav Important Update : శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటున్నాడు : సూర్యకుమార్

















