CM Revanth Reddy : న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన అనుచరుడిగా పేరు పొందిన ఇప్పటి సీఎం అనుముల రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy ) పావుగా వాడుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఓ ఎమ్మెల్సీని డబ్బులతో కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నం పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. రేవంత్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆయన జైలు నుంచి విడుదలై బెయిల్ పై బయటకు వచ్చారు. ఇదంతా కావాలని తనను ఇరికించారని, దీనికంతటికి మాజీ సీఎం కేసీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఆనాడు పవర్ లో లేని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని , తనను ఇబ్బందికి గురి చేసిన కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని వదిలి వేసే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.
CM Revanth Reddy Gets Huge Relief
ఓటుకు నోటు కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది సుప్రీంకోర్టులో. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తీర్పు రిజర్వ్ చేసింది. ఇదిలా ఉండగా ఓటుకు నోటు కేసులో ఏ4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య పేరును హైకోర్టు క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రాథమిక దశలోనే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయడంపై విచారణకు ప్రభావం పడుతుందని, మత్తయ్యను విచారించేందుకు అనుమతి కావాలని 9 ఏళ్లుగా తాము సుప్రీంకోర్టును కోరుతున్నామని తెలిపారు సర్కార్ తరపు న్యాయవాది. మత్తయ్య సీన్ ఆఫ్ అఫెన్స్‌లో లేడు.. కాగా దొరికినప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఉన్న వ్యక్తులలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, A1, A2,A3లుగా ఉన్నారు. ఇవన్నీ పరిశీలించే హైకోర్టు మత్తయ్యపై ఎఫ్ఐఆర్ కొట్టేసిందని తెలిపారు. ఇరు వైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
Also Read : Popular Cricketer Sourav Ganguly : బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా గంగూలీ















