CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ నెలలో నిర్వహించబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్బంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఇందులో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో వచ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మిట్ కు దేశ విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. సమ్మిట్ ఏర్పాట్లు, శాంతిభద్రతల నిర్వహణ, సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ ఆవిష్కరణ తదితర అంశాల పై అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
CM Revanth Reddy Strong Focus
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్ధేశం చేశారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, తదితర రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రపంచంలోని టాప్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులు, ఆంట్రప్రెన్యూర్స్ పెద్ద ఎత్తున హాజరవుతున్నారని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 కు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ముర్ముతో పాటు ఉపరాష్ట్రపతి కేపీ రాధాకృష్ణన్ లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి.
Also Read : Minister Adluri Laxman Interesting Comments : మహిళా సాధికారత కోసం సర్కార్ ప్రయత్నం


















