CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పూజలు చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా స్వామిని దర్శించుకున్నానని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో గణేశుడిని దర్శించుకుని ప్రార్థనలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదంతా స్వామి వారి కృప, దయ, ఆశీర్వాదం వల్లనే జరిగిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Key Comments
హైదరాబాద్ సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఈ సదుపాయం అందించే ఏకైక రాష్ట్రం కేవలం ఒక్క తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. 71 సంవత్సరాల ఐకానిక్ వేడుకను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు ఉత్సవ కమిటీని అభినందించారు. దేశంలో గణేష్ ఉత్సవాల గురించి ప్రజలు మాట్లాడేటప్పుడు, ఖైరతాబాద్ గణపతి ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని చెప్పారు సీఎం.
భక్తులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి భక్తితో పండుగను జరుపుకోవాలని తాము కోరుకున్నట్లు తెలిపారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఉత్సవాలు అంతరాయం లేకుండా జరిగేలా చూసేందుకు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అసౌకర్యాన్ని నివారించడానికి ట్యాంక్ బండ్ , ఇతర నిమజ్జన ప్రదేశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. భక్తులు భక్తితో , అత్యంత జాగ్రత్తగా నిమజ్జనంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read : Sandeep Sikka Growth – AMFI : ఏఎంఎఫ్ఐ చైర్మన్ గా సందీప్ సిక్కా
















