CM Revanth Reddy : హైదరాబాద్ – ఇండియా కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన తెలుగు వాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బేషరతుగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు విన్నవించారు. ఎన్డీఏ అభ్యర్థి పీఎస్ రాధాకృష్ణన్ కు మద్దతు ఇస్తే ఒరిగేది ఏమీ ఉండదన్నారు. సమాజ అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేసిన సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలన్నారు సీఎం. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆత్మ ప్రభోదానుసారం లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్్ గా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ప్రధాని మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా లను ఏకి పారేశారు.
CM Revanth Reddy Requests
ఇప్పటికే పీఎస్ రాధాకృష్ణన్ కు ఉన్నతమైన పదవి కట్టబెట్టారని, ఆయనను ఎన్నుకోవడం వల్ల దేశానికి నష్టం తప్ప లాభం అంటూ ఏమీ ఉండదన్నారు. తమ కూటమి నుంచి ఎంపిక చేసిన బి. సుదర్శన్ రెడ్డికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందని చెప్పారు. దేశాన్ని మతం పేరుతో విచ్ఛిన్నం చేసే ఆర్ఎస్ఎస్, బీజేపీ , హిందూ భావజాలం నుంచి వచ్చిన పీఎస్ రాధాకృష్ణన్ వల్ల దేశానికి నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. విద్యావంతుడైన, నీతి, నిజాయితీ, నిబద్దత కలిగిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఎన్నుకుంటే దేశ భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. తాజగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Minister Atchannaidu Interesting Update : అన్నదాతల సంక్షేమం కోసం ప్రయత్నం


















