CM Revanth Reddy : హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ పాలనపై భగ్గుమన్నారు. గత సర్కార్ కావాలని విద్యా రంగాన్ని పట్టించు కోలేదని ఆరోపించారు. తాము కొలువు తీరిన తర్వాత కేవలం 55 రోజుల్లోనే 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పా కళా వేదిక వద్ద గురు పూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు టీచర్లు, లెక్చరర్లతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారంతా ఇతర శాఖలు తమ వద్ద ఉంచుకున్నారని కానీ తాను మాత్రం ఏరికోరి విద్యా శాఖను తీసుకున్నట్లు చెప్పారు.
CM Revanth Reddy Key Comments
దేశంలో ఎక్కడా లేని రీతిలో 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంతో తెలంగాణ బిడ్డలు పోటీ పడేలా తీర్చి దిద్దుతామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. గత పదేళ్ల గులాబీ బాస్ కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. అన్ని రంగాలు నిర్వీర్యమై పోయాయని ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదన్నారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని తీసుకెళ్లారని, ప్రజలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉపాధ్యాయులకు అండగా నిలుస్తుందన్నారు. కొత్త విద్యా విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని సీఎం చెప్పారు.
Also Read : Mumbai Police Shocking Raj Kundra : శిల్పా శెట్టి పెనిమిటి ముంబైల్ పోలీస్ లుక్ అవుట్ నోటీసులు
















