CM Revanth Reddy : తెలంగాణలో 10 ఏళ్ల పాటు మనమే పవర్ లో ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని చెప్పారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలన్నారు. నేతలుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్ట పడాలని పిలుపునిచ్చారు. ఖర్గేను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.
CM Revanth Reddy Comments
శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని స్పష్టం చేశారు. లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందన్నారు.
తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన అనుభవం ప్రస్తుతం పార్టీకి ఉపయోగ పడుతోందన్నారు. ఈ సమయంలో మనముందు పెను సవాళ్లు ఉన్నాయని, రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని చెప్పారు సీఎం. ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని అన్నారు. ప్రత్యేకించి దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో తాము అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం బిగ్ సక్సెస్ అయ్యిందని, రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు.
Also Read : Ireddy Srinivas Reddy Breakthrough : అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్ గా ఐరెడ్డి
















