CM Revanth Reddy : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ది కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండాలని తాను నిర్ణయం తీసుకున్నానని , అందుకే మోదీతో, ఇతర నాయకులతో దోస్తానా చేస్తున్నానని చెప్పారు. బీజేపీలోనే కాదు దేశంలోని అన్ని పార్టీల నాయకులతో తనకు సన్నిహిత సత్ సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు కోవడానికి దేశ రాజధాని చుట్టూ తిరగడం, కేంద్ర మంత్రులను కలవడంలో తనకు ఎటువంటి తప్పు కనిపించలేదని అన్నారు. అయితే తెలంగాణ అభివృద్ధిలో, ముఖ్యంగా రాజధాని నగరం , పరిసర ప్రాంతాలను మార్చడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులలో అడ్డంకులు సృష్టించినందుకు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy Comments
కాగా కేంద్ర సర్కార్ మొదట్లో తనకు చాలా సహకారం చేసిందన్నారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). అయితే రాను రాను కేంద్ర మంత్రి జోక్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని, సకాలంలో నిధులు తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రధానంగా కిషన్ రెడ్డిని తప్పు పట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని రక్షణ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించడానికి, వడ్డీ భారాన్ని 11.9 నుండి 7.25 శాతానికి తగ్గించడానికి రుణ పునర్నిర్మాణం, ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి వరకు, మచిలీపట్నం పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, రీజినల్ రింగ్ రోడ్ , హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు అనుమతి కోసం తన అభ్యర్థనను ఆమోదించినట్లు తెలిపారు.
Also Read : Minister Ponnam Sensational Comments : కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయం


















