CM Revanth Reddy : హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ నూతన విద్యా విధానం రూపకల్పన పై సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందాలని స్పష్టం చేశారు.. ఈ విషయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు రేవంత్ రెడ్డి. విద్యా విధానం లో సమూల మార్పులు, ప్రక్షాళన జరిగి తీరాల్సిందేనని పేర్కొన్నారు. ప్రతిపాదిత నూతన విద్యా పాలసీ కేవలం విద్యా వ్యవస్థలో మార్పు తేవడం మాత్రమే కాకుండా పేదరిక నిర్మూలన సాధించేలా ఉండాలన్నారు సీఎం.
CM Revanth Reddy Key Comments on Education
విద్యా రంగంలో గతంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఏడాదికి 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతుంటే వారి లో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. నాణ్యత, నైపుణ్యత కొరవడటం సమస్యకు కారణం అన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని తాను బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకు రావాల్సిన అవరం ఉందన్నారు. నూతన విద్యా పాలసీ ఆ దిశగా రూపకల్పన జరగాలన్నారు. మేధావులు, విద్యాధికుల నుండి సూచనలు, సలహాలు తీసుకుని కొత్త పాలసీ రూపొందించాలని స్పష్టం చేశారు.
Also Read : Amit Shah Interesting Comments : తెలంగాణ ప్రజలకు అమిత్ షా కంగ్రాట్స్

















