CM Revanth : హైదరాబాద్ – ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth) సంచలన ప్రకటన చేశారు. మహిళలకు తీపి కబురు చెప్పారు. మీరు లేక పోతే ప్రభుత్వం లేదన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తోందని చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత ఎదిగేందుకు దోహద పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన కీలక సమావేశంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
CM Revanth Reddy Key Comments
ఈ సందర్బంగా మహిళలకు తీపి కబురు చెప్పారు. 33 శాతం రిజర్వేషన్లు అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో ఇస్తామంటూ ప్రకటించారు. అదనంగా మరో 10 సీట్లు కలిపి మొత్తంగా 51 సీట్లు ఇచ్చేందుకు ఆలోచిస్తామని, ఇందుకు సంబంధించి ఏఐసీసీ కూడా సుముఖంగా ఉందన్నారు. అంతే కాదు రమా రమి 60 సీట్లు ఇచ్చేలా తాను ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు ఎ. రేవంత్ రెడ్డి. ఇప్పటికే కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇటు అసెంబ్లీ అటు లోక్ సభ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి పునర్విభజన ఉంటుందన్నారు.
దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసన సభ, లోక్ సభ నియోజకవర్గాలు మరింత పెరుగుతాయని, దీంతో మహిళలకు సమ ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను 33 శాతం రిజర్వేషన్లను అనుసరించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ఎ. రేవంత్ రెడ్డి. అన్ని రంగాలలో మహిళలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ అభిమతని సీఎం స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వేల కోట్లు రుణంగా ఇచ్చామన్నారు.
Also Read : Stock Market Sensational : ట్రంప్ హెచ్చరికకు రూపాయి దెబ్బ – దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం


















