Harish Rao : హైదరాబాద్ – ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. తమ పార్టీకి చెందిన నేతలతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లందరిపై నిఘా పెంచారని, అంతే కాకుండా ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నాడని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులను ప్రత్యేకించి పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చాడని అన్నారు. మీరు కావాలని బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని, హరీశ్ రావుకు (Harish Rao) ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటూ ప్రశ్నించాడని ధ్వజమెత్తారు. ఇంకో అడుగు ముందుకేసి సదరు జర్నలిస్టులకు వార్నింగ్ కూడా ఇచ్చాడని మండిపడ్డారు హరీశ్ రావు.
BRS MLA Harish Rao Shocking Comments on CM Revanth Reddy
శుక్రవారం తన్నీరు హరీశ్ రావు మీడియాతతో మాట్లాడారు. నువ్వు పదే పదే హరీశ్ రావుతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ పదే పదే అన్నాడని, నీవు ఎవరెవరితో ఏమేం సంభాషిస్తున్నావో తనకు అంతా తెలుసంటూ కూడా బెదిరించాడని, దీన్ని బట్టి చూస్తే ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నట్లు అర్థమై పోతుందన్నారు. ఆ విలేఖరి నాతో మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డికి ఎలా తెలుసు అని ప్రశ్నించారు తన్నీరు హరీశ్ రావు. ఫోన్ ట్యాప్ చేస్తేనే కదా తెలిసేది అంటూ నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉండగా దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో సీఐబీ మాజీ చీఫ్ గా పని చేసిన ప్రభాకర్ రావుపై సిట్ ను ఏర్పాటు చేసింది సర్కార్. విచారణ కొనసాగుతోంది. పలుమార్లు తనను ప్రశ్నించారు. ఇవాళో రేపో దర్యాప్తు నివేదిక త్వరలోనే సమర్పించనున్నట్లు సమాచారం.
Also Read : Ex Minister Yanamala Fired on YS jagan : జగన్ రెడ్డి వైఖరి అప్రజాస్వామికం
















