Nitish Kumar : బీహార్ : ఈసారి కూడా బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కలిసికట్టుగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీఎంగా నితీశ్ కుమార్ (Nitish Kumar) ఉంటారని స్పష్టం చేశారు. తమ పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు. బుధవారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. అయితే సీట్ల పంపకానికి సంబంధించి ఇంకా కొలిక్కి రాలేదని, చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. తుది ఫార్ములా ఏమిటనేది త్వరలోనే ఖరారవుతుందని చెప్పారు. ఇదే సమయంలో ఇండియా కూటమి గురించి గిరి రాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bihar CM Nitish Kumar Comments
వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్డీయే అంటేనే సుస్థిరత, అభివృద్ది అని అన్నారు. ఆయా పార్టీల మధ్య ఇప్పటికే సఖ్యత లేదని, ఇక వాళ్లు ఎలా బరిలోకి దిగుతారంటూ ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి. జనం ఐదేళ్ల పాటు పాలించే పార్టీలను, వ్యక్తులను , నేతలను కోరుకుంటారని అన్నారు. అందుకే తమ ఎన్డీయేకే మరోసారి పట్టం కట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ పార్టీల తరపున ఇప్పటికే సీఎంగా ఎవరు ఉండాలనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్ నే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని స్పష్టం చేశారు గిరి రాజ్ సింగ్.
Also Read : Air Chief Marshal AP Singh Warning to Pakistan : భారత వైమానిక శక్తిని తట్టుకోవడం కష్టం


















