ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం

టెంపుల్ టూరిజంలో ఏపీకి తిరుగులేదు

hellotelugu-APCM

అమరావతి : దేవాలయాల పరిరక్షణపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్ర‌కటించారు. ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక భావన కలిగి ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార ఆలయ ప్రాంగణంలో ఓ ఛాన‌ల్ నిర్వ‌హించిన శివోహం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…శివోహం కార్యక్రమాన్ని నిర్వహించిన యాజ‌మాన్యాన్ని అభినందించారు. దేవతల రాజధాని, ప్రజా రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామం అని అన్నారు. పరమ శివుడు చీకట్లు తొలగించి వెలుగులు ప్రసాదిస్తాడని, శివారాధనే ముక్తికి దగ్గర దారి అని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఆనాడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించాం. నేడు అమరావతి నిర్మిస్తున్నాం అన్నారు. అమరావతి భావితరాలకు ఆదర్శ నగరంగా నిలుస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు పెంచుతుందని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రం బాగుండాలని, సకాలంలో పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం సహా సంపద సృష్టించి దాన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తిరిగి పేదలకు అందేలా దీవించమని ఆ పరమ శివుడిని ప్రార్ధిస్తున్నానని అన్నారు సీఎం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్నామ‌న్నారు. పేదరిక నిర్మూలన, అందరికీ సమాన అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం అన్నారు. ఏపీ అంటే క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్ , ఐటీ హబ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ అని పేర్కొన్నారు. సంపద సృష్టించాలంటే టెక్నాలజీ అవసరం అని చెప్పారు. ఆనాడు హైదరాబాద్ లో ఐటీని ప్రమోట్ చేయడానికి మెక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను తీసుకొచ్చానని అన్నారు.

Exit mobile version