CM MK Stalin : తమిళనాడు – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై సుదీర్ఘ లేఖ రాశారు. శనివారం ఆయన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన అధినేతలకు వీటిని పంపించారు. తమ అభిప్రాయాలను కూలంకుశంగా తెలియ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేకించి ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత శ్రద్ధ వహించాలని , సంబంధిత విభాగాలు ప్రశ్నాపత్రాన్ని పరిశీలించి వివరణాత్మక ప్రతిస్పందనను అందించాలని కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM MK Stalin). కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై తన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తయారు చేసిన ప్రశ్నాపత్రంపై స్పందించాలని అన్నారు.
CM MK Stalin Write a Letter
ఇందులో కీలక అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వరుస రాజ్యాంగ సవరణల కారణంగా, కేంద్ర చట్టాలు, కేంద్ర విధానాలు క్రమంగా సున్నితమైన అధికార సమతుల్యతను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మార్చాయని స్టాలిన్ ఆరోపించారు. కేంద్ర స్థాయిలో పెద్ద మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, ఇవి రాష్ట్ర విధులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు సీఎం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లకు సంబంధించిన షరతులు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఒకే పరిమాణానికి సరిపోయే మార్గదర్శకాలు, తప్పనిసరి పని-వారీగా ఆమోదాలు, సూక్ష్మ నిర్వహణ ద్వారా రాష్ట్ర ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తాయి లేదా నిర్దేశిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవాళ మనందరం ఒక నిర్ణయాత్మక క్షణంలో ఉన్నామన్నారు. ఈ పరిణామాలను తిరిగి అంచనా వేయడం, నిజమైన సమాఖ్యవాదాన్ని బలోపేతం చేసే భవిష్యత్ చట్రాన్ని సృష్టించడం ఈ సమయానికున్న అవసరం అని నొక్కి చెప్పారు సీఎం.
Also Read : Harish Rao Fired on Ghosh Report : ఘోష్ నివేదికను సస్పెండ్ చేయాలి : హరీశ్ రావు

















