CM MK Stalin : చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కరూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఊహించని దానికంటే ఎక్కువగా జనం పోగయ్యారు. చాలా మంది ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటా హుటిన ఆస్పత్రులలో చేర్పించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటన తెలిసిన వెంటనే విజయ్ తన ప్రసంగాన్ని ఆపేశారు. తక్షణమే స్పందించారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM MK Stalin). ఆయన హుటా హుటిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.
CM MK Stalin Orders
మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు. ఈ మొత్తం ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు సీఎం ఎంకే స్టాలిన్. ప్రాణాలు కోల్పోయయిన వారిలో 16 మంది మహిళలు, ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. విచారణ అధికారిగా మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీసన్ నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనకు పూర్తిగా టీవీకే పా్రటీ చీఫ్ విజయ్ బాధ్యత వహించాలని డీఎంకే నేతలు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన విజయ్ ఏకంగా రాత్రి 7 గంటలకు రావడం ఏమిటని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయాలనే డిమాండ్ అంతకంతకూ ఎక్కువవుతోంది.
Also Read : TVK Vijay Stampede Sensational : విజయ్ ర్యాలీలో విషాదం 39 మంది దుర్మరణం


















