కేరళ : కేరళలో కొత్తగా కొలువు తీరబోతోంది కాంగ్రెస్ కూటమి సర్కార్. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు సతీశన్. కేసీ వేణుగోపాల్ ను కాకుండా సతీశన్ కు సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చింది ఏఐసీసీ. శుక్రవారం ఆయన మర్యాద పూర్వకంగా మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ను కలిశారు. తిరువనంతపురంలో సీనియర్ నాయకులను కలిశారు . ఏఐసీసీ ద్వారా ముఖ్యమంత్రిగా నామినేట్ అయినప్పటి నుండే సతీషన్ సీనియర్ నాయకులను కలుస్తూ వచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన సతీశన్‌ను ఆహ్వానించడానికి విజయన్ , ఆయన కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు లోపలికి వెళ్లి చర్చలు జరిపారు.
మధ్యాహ్నం 12:10 గంటల తర్వాత ఆయన విజయన్ నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు లోపలికి వెళ్లి చర్చలు జరిపారు. సతీశన్‌ను ఇంటి లోపలికి తీసుకు వెళుతున్నప్పుడు విజయన్ ఆయన చేతిని పట్టుకున్నారు. టీ తాగుతూ సరదాగా మాట్లాడుకున్న సమయంలో వారు ఆరోగ్యం, ఆహార నియమాల గురించి కూడా చర్చించుకున్నారు. ఈ సంభాషణ సమయంలో విజయన్ గ్రీన్ టీ తాగుతున్నారు. విజయన్ అనుసరించే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని సతీశన్ అభినందించారు. ఇదిలా ఉండగా ఎల్డీఎఫ్ కేరళలో పవర్ ను కోల్పోయిన తర్వాత విజయన్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. బేకరీ జంక్షన్ వద్ద ఇటీవల అద్దెకు తీసుకున్నారు. 2021 నుండి 2026 వరకు విజయన్ ముఖ్యమంత్రిగా తన రెండవ పదవీకాలం కొనసాగినప్పుడు కేరళ అసెంబ్లీలో సతీశన్ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
















