R Ashoka : బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో నవంబర్ విప్లవం రావడం ఖాయమని జోష్యం చెప్పారు కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆర్. అశోక (R Ashoka). ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తప్పకుండా సీఎం సిద్దరామయ్యను మార్చడం ఖాయమని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రస్తుతం బీహార్ లో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో , తమిళనాడులో వచ్చే ఏడాది 2026లో జరిగే ఎన్నికల్లో పార్టీకి నిధులు సమకూర్చేందుకు ఏఐసీసీ కర్ణాటక సర్కార్ ను ఏటీఎంగా ఉపయోగిస్తోందని బీజేపీ నేత ఆరోపించారు. ఇదిలా ఉండగా నవంబర్ నెల అంటేనే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతుందన్నారు. రాజకీయ సంక్షోభాలన్నీ ఈ నెలలోనే గతంలో జరిగాయని గుర్తు చేశారు ఆర్. అశోక.
R Ashoka Shocking Comments on Karnataka CM
ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య సక్సెస్ కాలేదన్నారు. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముందుకు సాగుతున్నాడని మండిపడ్డారు. ఆయనను ఆ పార్టీ హైకమాండ్ తప్పించ బోతోందని , ఇది తమకు విశ్వసనీయంగా సమాచారం ఉందన్నారు ఆర్. అశోక.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఖచ్చితంగా ఉంటుందన్నారు. పెద్ద ఎత్తున పార్టీకి నిధులు సమకూర్చి పెడతారో వారికే సీఎం పదవిని ఏఐసీసీ కట్ట బెడుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లలో చూస్తే డీకే శివకుమార్ అత్యధికంగా డబ్బులు వసూలు చేయడంలో దిట్ట అని, ఆయనే సీఎం కావడం పక్కా అని జోష్యం చెప్పారు ఆర్. అశోక. ఇదిలా ఉండగా బీజేపీ ప్రతిపక్ష నాయకుడు తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : CM Revanth Reddy Clear Instructions : రైతుల పంటలు దెబ్బతినకుండా కాపాడాలి

















