CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక ప్రకటన చేశారు. చిత్తూరు జిల్లాలోని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సంజీవిని ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో వైద్య , ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. ప్రధానంగా సంజీవిని ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో యూనివర్శల్ హెల్త్ స్కీం గురించి కూడా చర్చించారు. ఈ ప్రాజెక్టును నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జనవరి నెల నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Focus on Sanjeevini Project
ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పీపీపీ ప్రాతిపదికన తొలివిడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. పీపీపీ విధానంలో వేగంగా బోధనాసుపత్రులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఈ సందర్బంగా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యూనివర్శల్ హెల్త్ పథకం అమలుకు తాము శ్రీకారం చుట్టామని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా రేపు, ఎల్లుండి సీఎం చంద్రబాబు నాయుడు పుట్టపర్తిలో పర్యటిస్తారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలలో పాల్గొంటారు. ఈ సందర్బంగా తిరుమలను దర్శించుకుని తిరిగి ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు వస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమెకు స్వాగతం పలుకుతారు సీఎం.
Also Read : President Murmu Tirumala Important Visit : శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి


















