CM Chandrababu : అమరావతి : మొంథా తుపాను వల్ల నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). సచివాలయంలో మరోసారి సమీక్ష చేపట్టారు. సహాయక, పునరావాస చర్యలకు సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎక్కడా నిర్లక్ష్యం చేయ కూడదని స్పష్టం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీవ్రత తగ్గినా ఆ ప్రభావం ఇంకా ఉంటుందన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని ఈ సందర్బంగా స్పష్టం చేశారు. నవంబర్ లో విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐసీసీ సదస్సులో నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Comments about Farmers
దీనిపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టాలని సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువ పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Also Read : ICC Womens World Cup Huge Record : భారీ స్కోర్ ఛేదనలో భారత మహిళా జట్టు రికార్డ్


















